వసంత నగర్ ప్రాథమిక పాఠశాల లో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నేటి ఉదయం రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల ప్రకారం గొందిపర్ల గ్రామం లోని వసంత నగర్ ప్రాథమిక పాఠశాల యందు మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ఏర్పాటు చేయడం జరగింది.ఈ సమావేశం నకు ప్రత్యేక అధికారి గా భూ గర్భ జల శాఖ డిప్యూటీ డైరక్టర్ ఎం శ్రీనివాస రావు , ముఖ్య అతిధులుగా గ్రామ సర్పంచ్ బి శ్రీనివాసులు, మాజీ ఏం పి టి సి నాగరాజు హాజరు కావడం జరిగింది.ఈ కార్యక్రమం నకు పేరెంట్స్ కమిటి చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ప్రత్యేక అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ పాఠశాల లొ తల్లి తండ్రులు మరియు ఉపాధ్యాయులకు మధ్యన సమన్వయం ఏర్పడుటకు మరియు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు ఈ సమావేశం చాలా ఉపయోగ పడుతుంది.ఈ సమావేశంలో పాఠశాల అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు తగు సూచనలు చేయవలెనని తద్వారా మీ పాఠశాల అభివృద్ధి కి తగు చర్యలు తీసుకోవచ్చు అని తెలిపారు . గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ తాను పాఠశాల అభివృద్ధి కొరకు ఎల్లప్పుడూ ముందు వరుస లో వుంటాను అని తెలిపారు. మాజీ ఏం పి టి సి నాగరాజు మాట్లాడుతు రాష్ట్రం లో విద్యాభివృద్ధి కొరకు విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు అహర్నిశలు శ్రమించి కష్టపడుతున్నారు. గత ప్రభుత్వ హయం లో జరిగిన నష్టాలను పూడ్చటానికి ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాకి ప్రకాష్ రావు మాట్లాడుతు గతం లో మోడల్ స్కూల్ గా వున్న ఈ పాఠశాల వచ్చే విద్యా సంవత్సరం లో మరల మోడల్ స్కూల్ గా మారుతుంది. తల్లి తండ్రులు మా పై నమ్మకం ఉంచి మీ పిల్లలను పాఠశాల కు పంపుతున్నారు.మీ నమ్మకం ను నిలబెట్టే విధంగా మా శాయశక్తుల కృషి చేస్తాం.మీ పిల్లలను క్రమం తప్పక పాఠశాల హాజరు అయ్యే విదంగా మీరు కృషి చెయ్యవలసిన అవసరం ఉంది. హాజరు తక్కువ అయితే తల్లికి వందనం డబ్బులు కూడా రావు. కాబట్టి హాజరు పెంచే దిశగా మీరందరూ మీ పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపాలి అని కోరారు. వారికి హోలిస్టిక్ కార్డ్స్ గురించి వివరించడం జరిగింది. వారి పిల్లల కు సంబందించిన హోలిస్టిక్ కార్డ్స్ పంపిణీ చేయటం జరిగింది. తరగతి ఉపాధ్యాయులు పిల్లల ప్రగతి గురించివారికి వివరణ ఇవ్వడం జరిగింది. తల్లులకు తరగతి వారిగా రంగ వల్లి పోటీలు, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ పోటీలు యందు విజేతలకు ముఖ్య అతిధులు బహుమతి ప్రధానం చేసారు. తదనంతరం తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు మరియు అతిథులు విద్యార్థుల చే సహపంక్తి భోజనం తో కార్యక్రమం ముగిసింది.