రేషన్ డీలర్స్ ..జిల్లా కలెక్టరేట్లో సమస్యల మెమొరండం అందజేత
1 min readడిపో నిర్వహణ,ఖర్చులు పోను కనీసం 20,000 ఆదాయం తగ్గకుండా చూడాలి
డీలర్స్ కుటుంబ సాధారణ జీవనానికి ఇబ్బంది లేకుండా దృష్టి సారించాలి
జిల్లా అధ్యక్షులు రాజులపాటి గంగాధరరావు గౌడ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు ప్రతినిధి : రాష్ట్ర రేషన్ డీలర్స్ అసోసియేషన్ సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో మాదిరి గా కార్డ్స్ పునః పరిశీలన (బైబిర్ కేషన్) చేసి అందరు కార్డ్స్ కి ప్రస్తుత ధరల ప్రకారం కుటుంబ సాదారణ జీవనానినికి ఇబ్బంది లేకుండ చూడాలని రేషన్ డీలర్స్ అసోసియేషన్ సంఘం నాయకులు జెసి దాత్రి రెడ్డిని సోమవారం గ్రీవెన్స్ సెల్ లో కలిశారు. డిపో నిర్వహణ మరియు కర్చులు ఫోను కనీసం 20 వేలు ఆదాయం తగ్గకుండ ఉండాలని కనీసం గ్రామీణ ప్రాంతాలలో 600, మండల కేంద్రాలలో 750, మున్సిపాలిటీలలో 850, కార్పొరేషన్ లో 950 కార్డ్స్ ప్రతి షాప్ కి వుంచాలని విజ్ఞప్తి చేశారు. అలగే మండలం యూనిట్ గా రేషన్ కార్డులు సమం చేసి ప్రతి డీలర్స్ కి న్యాయం చెయ్యలని ఏలూరు జిల్లా సంఘం ద్వార కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు రాజులపాటి గంగాధరరావు గౌడ్, ప్రధాన కార్యదర్శి నరసింహ రావు, ఉపాధ్యక్షులు చిందా కృష్ణంరాజు, ఎండి అన్వర్ భాష, ముఖ్య సలహాదారు సిరాజీ, మరియు ఆదిబాబు, శివకుమార్, శేఖర్,రాంబాబు,వెంకటరావు తదితరులు హజరయ్యి జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో మెమోరాండం అందించారు.