బహుమతులను అందజేసిన ఎంఈఓ సుభాన్..
1 min readఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుందని నందికొట్కూరు మండల విద్యాశాఖ అధికారి సుభాన్ అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని భవిత పాఠశాలలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు మంగళవారం సహిత విద్య ఉపాధ్యాయులు (ఐఈఆర్టి )విజయకుమారి రవిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా దివ్యాంగ చిన్నారులతో కలసి నందికొట్కూరు పట్టణంలో ప్ల కార్డులు చేత పట్టుకొని పటేల్ సెంటర్ లో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ సుభాన్ మాట్లాడుతూ దివ్యాంగులని చిన్నచూపు చూడకుండా అందరితో పాటుగా వీళ్లను సమానంగా చూస్తూ అవసరమైన అవకాశాలను వీరికి అందించినట్లయితే వీరు దేనిలోనూ సరిపోరన్నారు. దివంగ చిన్నారులను మంచిగా చదివించాలని ఉద్యోగ అవకాశాల్లోనూ రిజర్వేషన్లు ఉన్నాయన్నారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవిత పాఠశాలకు చిన్నారులను పంపించాలని వారికి ప్రత్యేకంగా విద్యను అందించడం ఐఈఆర్టి లు విజయ కుమారి,రవిబాబు అన్నారు.ఆటల పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు ఎంఈఓ,పల్లె ప్రియాంక సేవాసమితి పూర్వ విద్యార్థి సంఘం నాయకులు వెంకట రమణయ్య,శ్రీనివాస్,భరత్ భూషణ్,ఎంపీపీ ఎస్ కోట హెచ్ఎం తిరుమలెస్ జెడ్పిహెచ్ఎస్ ఉర్దూ పేట హెచ్ఎం రాజేశ్వరి దేవి మరియు సహిత ఉపాధ్యాయులు, ఫిజియోథెరపిస్టు బహుమతులను అందజేశారు.