69.84% వాటాను పొందనున్న మెర్క్యూరీ ఈవి టెక్ లిమిటెడ్
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : విద్యుత్ వాహనాల పరిశ్రమలో ప్రముఖ సంస్థగా ఉన్న మెర్క్యూరీ ఈవి టెక్ లిమిటెడ్ డిసి2 మెర్క్యూరీ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 69.84% వాటాను (25,00,000 ఈక్విటీ షేర్లు) పొందేందుకు షేర్ పర్చేజ్ అగ్రిమెంట్‌ను సంతకం చేసింది. ఈ ఒప్పందం అనంతరం డిసి2 మెర్క్యూరీ కార్స్ మెర్క్యూరీ ఈవి టెక్ యొక్క అనుబంధ సంస్థగా మారుతుంది.డిసి2 మెర్క్యూరీ కార్స్ డిజైన్, మోడిఫికేషన్ రంగంలో ప్రత్యేకత కలిగి ఉన్న సంస్థ. ఇందులో ప్రధాన డిజైనర్ గా ఉన్న దిలీప్ చాబ్రియా అద్భుతమైన కార్ డిజైన్ నైపుణ్యాలు మెర్క్యూరీ ఈవి టెక్‌కు నూతన ఉత్సాహం కలిగించనున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా మార్కెట్‌లో కొత్త ఉత్పత్తుల ప్రాచుర్యం పొందడమే కాకుండా, వ్యాపార వృద్ధికి తోడ్పడుతుంది.ఇటీవల, మెర్క్యూరీ ఈవి టెక్ గ్లోబల్ మెర్క్యూరీ కంటైనర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కొత్త అనుబంధ సంస్థను స్థాపించేందుకు బోర్డు ఆమోదం పొందింది.మెర్క్యూరీ ఈవి టెక్ తన 18 ఎకరాల స్థలంలో నిర్మించిన అత్యాధునిక మాన్యుఫ్యాక్చరింగ్ సదుపాయాలతో ఈవీ పరిశ్రమలో అనేక వాహనాలను తయారు చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా ద్వారా గ్రీన్ ఎనర్జీ మార్గం వైపుగా నడిచే లక్ష్యంతో, సంస్థ తన కస్టమర్‌లకు అధునాతన ఈవీ సేవలను అందిస్తుంది.ఈ విలీనంతో మెర్క్యూరీ ఈవి టెక్ లిమిటెడ్ మరింత విస్తృతమైన ఉత్పత్తి శ్రేణితో ఈవీ రంగంలో అగ్రగామిగా ఎదగనుంది.