ఘనంగా క్రిస్మస్ వేడుకలు….
1 min readచర్చీలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులు
చర్చీలను విద్యుత్ దీపాలతో అలంకరణ
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని జరుపుకునే క్రిస్మస్ పండుగ ను క్రైస్తవ సోదరులు బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున నుండి క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చీలను వివిధ రకాల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో చర్చీ లో సంఘ పెద్దలు ఏబు, సుందరాజు, ఖయ్యుం, ప్రభుదాస్, దేవదాసు, కుమార్ ఆధ్వర్యంలో ఫాస్టర్ రెవరెండ్ వేదనాయకం నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఏసుక్రీస్తు జీవిత చరిత్ర గురించి వివరించారు. అలాగే మండల పరిధిలోని బూదూరు, చెట్నహల్లి, చిలకలడోణ, మాధవరం, మాలపల్లి, వగరూరు, తిమ్మాపురం, సుంకేశ్వరి, రాంపురం, బసాపురం, కాచాపురం, తుంగభద్ర, రచ్చమరి, కల్లుదేవకుంట సింగరాజన్నహళ్లి తదితర గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో చర్చీలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.