జల వనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ని కలసిన.. ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు
1 min readఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
సాధించుకున్న అర్హతలను పరిగణంలోకి తీసుకోవాలి
సీనియార్టీ లిస్టు త్వరగతిన పూర్తి చేయాలి
పలు సమస్యలు పరిష్కరించాలని కోరిన రాష్ట్ర నాయకులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : విజయవాడలోజలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ టీ వి ఎన్ ఏ రత్నకుమార్ ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం కలిశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నఉద్యోగుల కు సంబంధించిన వివిధ సమస్యలు. ముఖ్యంగా ఏపీ ఎంఎస్ నుంచి ఏపీఇఎస్ ఎస్ కి మారడానికి కావాల్సిన అవసరమైన అర్హత కోసం ఇచ్చిన జీవో 64 నకు అమెండమెంట్ ఉద్యోగి జాయిన్ అయిన తర్వాత ఏఇ/ఏఇఇ కొరకు సాధించుకున్న అర్హతలు పరిగణనలోకి తీసుకుని ఇవ్వాలని, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సూపురింటెండెంటలకు ఎన్ టి పి ఏ పదోన్నతి కొరకు సీనియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసి. సి ఆర్ లను రప్పించుకొని త్వరితగతిన పూర్తి చేయాలని. ఇతర సమస్యలును ఇఎన్ సి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారించాలని రాష్ట్ర నాయకులు కోరారు. ఇటీవల వివిధ యూనిట్స్ లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్స్ ని హెచ్ఓడి లో కి విలీనం చేసినందుకు ENC ఇల్లు ఇఎన్ సి కి చోడగిరి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఇఎన్ సి కుమార్ స్పందిస్తూ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ రాష్ట్ర నాయకులు, ఎన్టీఆర్ జిల్లా నాయకులు, ఇఎన్ సి ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నరు.