PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యాశాఖ మంత్రిని కలిసిన ఏబీవీపీ రాష్ట్రప్రతినిధి బృందం

1 min read

పల్లెవెలుగు వెబ్  ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. గత ఐదు సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం బ్రష్టు పట్టించి విద్యార్థులకు విద్యను దూరం చేసింది.  అమ్మ ఒడి పేరుతో, నాడు నేడు పేరుతో, మరియు వసతి దీవెన, విద్య దీవెన అంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ వారి జీవితాలలో చీకటిని నింపింది. జీవో నెంబర్ 77 ఉన్నత విద్య ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తు వేస్తూ నిరుపేద విద్యార్థులు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేయడమే కాదు విశ్వవిద్యాలయాలను సైతం రాజకీయ క్షేత్రాలుగా వాడుకున్న వైనం ఈ రాష్ట్రంలో దాపరించింది.  విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఉపకులపత్తుల సైతం రాజకీయ మెప్పు పొందడం కోసం పార్టీ ఫౌండేషన్ డే అంటూ రాజకీయ నాయకుల యొక్క జన్మదినాలను విశ్వవిద్యాలయ కేంద్రంగా కేకులు కట్ చేస్తూ వీరంగం చేశారు. విద్యార్థులను పార్టీ ప్రోగ్రామ్స్ కు విక్షల విడిగా తరలిస్తూ వారిని ప్రోగ్రామ్స్ అటెండ్ కావాలని తప్పనిసరి నియమనిబంధనలను పెట్టేవారు.  సాంఘిక సంక్షేమ హాస్టల్ లో చదువుతున్నటువంటి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టలేకపోవడం.  నాడు నేడు పేర్లతో నూతన భవనాలు నిర్మిస్తామంటూ పేపర్లకు మాత్రమే పరిమితమైనటువంటి బిల్లులను తయారు చేస్తూ పార్టీకార్యకలాపాలకు వినియోగించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది.ఎక్కడికి అక్కడ నాడు నేడు పేర్లతో విద్యభ్యాసం లేనటువంటి గ్రామస్థాయి లీడర్ కూడా నేను పార్టీ కార్యకర్తను అంటూ విద్యకు కేటాయించినటువంటి ధనాన్ని మొత్తం దుర్వినియోగం పరుస్తూ ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చిన వైనం నిరుపేద విద్యార్థులు చూశారు.ఏపీఆర్జేసీ రాయలసీమ జిల్లాలలోని కేవలం ఒకే ఒక మహిళలజూనియర్ కళాశాలలో నియమించడం.దానికి సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి అయినటువంటి వారుచైర్మన్గా వ్యవహరించడం గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఈ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు విద్యావ్యవస్థలో నెలకొన్నాయి. ఇకనైనా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యాశాఖ మంత్రివర్యులు అయినటువంటి నారా లోకేష్ గారికి  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ప్రతినిధి బృందం కోరుతున్నాము. రాయలసీమ జిల్లాల ప్రతినిధిరాష్ట్ర సంయుక్త కార్యదర్శి గేటు ఎర్రిస్వామి పాల్గొనడం జరిగింది.ఈ రాయలసీమ జిల్లాలలో అనేకమంది బడుగు బలహీన వర్గాల తల్లిదండ్రులు వారి వలస జీవనం పై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అందుకుగాను రీజనల్ హాస్టల్ లను కర్నూలు అనంతపురం కడప ఈ ఉమ్మడి జిల్లాలలో ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.

About Author