PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సక్రమంగా అందజేయాలి

1 min read

నాగలాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషాగ్రామంలో శానిటేషన్, తాగునీటి సరఫరా గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని సక్రమంగా అందజేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం ఆదోని మండలం నాగలాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ మధ్యాహ్న భోజన పథకం అమలను పరిశీలించారు..అనంతరం  విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని జిల్లా కలెక్టర్ రుచి చూశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మధ్యాహ్న భోజనం కోసం వండిన పదార్థాలను పరిశీలించారు.. తప్పనిసరిగా మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని కలెక్టర్ ఆదేశించారు..పాఠశాల ఆవరణంలో ఉన్న వంటశాలను పరిశీలించారు.  కట్టెల పొయ్యి మీద వంటలు  చేయడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే గ్యాస్ స్టౌవ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా  విద్యాశాఖాధికారిని ఆదేశించారు.అనంతరం కలెక్టర్  భోజనం చేసారు..అన్నం  చాలా మెత్తగా ఉడికించారని తెలిపారు.. విద్యార్థులకు మంచిగా,  నాణ్యతతో కూడిన భోజనాన్ని అందజేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని కలెక్టర్ ఆదేశించారు..తదుపరి కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు.. ఈ విద్యా సంవత్సరంలో  పుస్తకాలు, బ్యాగ్స్, షూస్, సాక్స్, యూనిఫాం అందజేశారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నాగలాపురం గ్రామంలో శానిటేషన్, తాగునీటి సరఫరా గురించి గ్రామస్థులను  జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు..డి.రామాంజనేయులు అనే వ్యక్తితో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్రాగు నీరు ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి, పారిశుధ్య కార్యక్రమాలు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే   త్రాగు నీటి కుళాయి వద్ద నీటిని పట్టుకుంటున్న వారి వద్దకు జిల్లా కలెక్టర్ వెళ్లి రోజుకు ఎన్ని గంటల వరకు నీళ్ళు వస్తున్నాయి, నీళ్లు బాగున్నాయా  అని అడిగి తెలుసుకొన్నారు.. ఈ సందర్భంగా  కలెక్టర్ స్వయంగా కుళాయి  నీటిని పట్టుకొని త్రాగి, నీళ్లు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.జిల్లా కలెక్టర్ వెంట ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఆదోని తహశీల్దార్ హసీనా సుల్తానా, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, డిఈఓ సామ్యూల్, డిపిఓ నాగరాజు నాయుడు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author