ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంను అమలు చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఇంటర్ బాలుర , బాలికల కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ,అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వీరేష్ యాదవ్ గురువారం డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ 450 కళాశాలకు పైగా ఉన్నాయని విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం అమలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయలేకపోయిందని తెలిపారు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి ఇంటర్ విద్యార్థుల పై చర్చించి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయన్నే 9 గంటలకు కళాశాల ఉండడంతో మధ్యాహ్న భోజన పథకం ఈ కళాశాలలో అమలులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యాశాఖ ఇంటర్ బోర్డు అధికారుల స్పందించి మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు . ఈసమావేశంలో నాయకులు విష్ణు హర్ష ,అనంత్ కుమార్,హరీష్, ధనుష్, రంగస్వామి సోమిరెడ్డి పాల్గొన్నారు .