PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాఠశాలల్లో మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు అందించాలి..

1 min read

ఎంఈఓ విమలా వసుంధర దేవి 

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  మండల పరిధిలోని ఎంఈఓ కార్యాలయంలో, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసే వంట వారికి గురువారము శిక్షణ కార్యక్రమము నిర్వహించినట్లు ఎంఈఓ విమలా వసుంధర దేవి తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ ఆషారాణి మాట్లాడుతూ, పాఠశాలల్లో చిన్నపిల్లలకు వంట చేయడం దేవుడికి సేవ చేసినట్లు భావించాలని, అందువల్ల వారికి పరిశుభ్రమైన వాతావరణంలో వంట చేస్తూ, రుచికరమైన భోజనాన్ని అందించాలని, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెనూ ఉంటుందని ఆ మెనూ ప్రకారము, ఏ వంట ఎలా చేయాలి అనే విషయాన్ని ప్రొజెక్టర్ ద్వారా ఆషారాణి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీహెచ్ఓ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వంట చేసేటప్పుడు మరియు వడ్డించేటప్పుడు, వంట నిర్వాహకులు పరిశుభ్రత పాటించాలని, మధ్యాహ్న భోజన పథకం యొక్క మెనూ మరియు వంటలో ఉపయోగించే కూరగాయల వల్ల, విద్యార్థులకు చాలా రకాలైన న్యూట్రిషన్ అందుతాయని, దీనివల్ల విద్యార్థులు రక్తహీనతకు దూరంగా ఉంటారని తెలిపారు, వీరి తోపాటు నర్సు భారతి మరియు ఆరోగ్య కార్యకర్త ఆశాబి ఉన్నారు. ఎంఈఓ విమల వసుంధర దేవి మాట్లాడుతూ, ఈ శిక్షణలో నేర్చుకున్న విషయాలను దృష్టిలో పెట్టుకుని, విద్యార్థులకు రుచికరమైన మరియు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, వంట వండేటప్పుడు మరియు వంట వండే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మీరు అందించే భోజనం వల్ల విద్యార్థి  ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.  శిక్షణానంతరము వంట పోటీలు నిర్వహించారు, పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు.

About Author