మిడుతూరు రీసర్వే డీటీ సునీల్ రాజా బదిలీ..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ సునీల్ రాజా బదిలీ అయ్యారు.ఈయన డోన్ కు డిప్యుటేషన్ బదిలీపై వెళ్లారు.అక్కడ రీ సర్వే డీటీగా మరియు ఇన్చార్జి డిప్యూటీ తహసిల్దారుగా జిల్లా అధికారులు బాధ్యతలు అప్పగించారు.ఈయన డోన్ లో పనిచేస్తూ మిడుతూరు మండలానికి 16.10.2024 న రీ సర్వే డీటీ గా వచ్చారు. ఇక్కడ పని చేసిన రెండు నెలల్లోనే ప్రజల భూ సమస్యలను పరిష్కరించడానికి ఎంతగానో కృషి చేశారు.