మిడుతూర్ ఎంఎంఎస్ ప్రెసిడెంట్ అకాల మరణం..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మహిళా మండలి సమాఖ్య ప్రెసిడెంట్ గుంటెపోగు.శ్యామలమ్మ (33) అకాల మరణం చెందారు. ఈమె స్వగ్రామం మిడుతూరు మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందినవారు.మిడుతూరు వెలుగు కార్యాలయ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు గత వారం రోజుల క్రితం టైఫాయిడ్ జ్వరం రావడం మరియు ఆరోగ్య సమస్యలు ఉండడంతో నంద్యాల ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.మెరుగైన వైద్య చికిత్స కొరకు కర్నూలు విశ్వ భారతి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉండగా ఆదివారం సాయంత్రం మరణించినట్లు వెలుగు ఏపీఎం సుబ్బయ్య తెలిపారు. ఈమెకు భర్త సామేలు మరియు సుమంత్(13),జాన్సి (11),ఆరాధ్య(9) ఉన్నారు. శ్యామలమ్మ మృతితో భర్త మరియు పిల్లలు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంత మాయ్యారు.గత రెండేళ్లుగా ఎంఎంఎస్ ప్రెసిడెంట్ గా ఉన్నారని ఆయన తెలిపారు. సోమవారం స్వగ్రామం అయిన తిమ్మాపురంలో ఆమె భౌతిక కాయానికి ఎంఎంఎస్ సిబ్బంది ఏపీఎం మరియు ఇన్చార్జి ఏసీ అంబమ్మ,వెలుగు సీసీలు కృష్ణారెడ్డ,గాంధీ,సామన్న, నాగన్న,రమణమ్మ నివాళులు అర్పించారు.అనంతరం మండల సమాఖ్య నుండి ఆర్థిక సహాయం వారు అందజేశారు.మధ్యాహ్నం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.