PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీరభద్ర గౌడ్  ఆధ్వర్యంలో టిడిపి లోకి భారీవలసలు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,తాలూకా ప్రజల అభిమాన నాయకులువీరభద్ర గౌడ్  ఆధ్వర్యంలో.. హొళగుంద మండలంహెబ్బటం గ్రామంలో వైసిపి నుండి మాజీ జడ్పిటిసి అయ్యాలప్ప,కత్తి నరసన్న,బాలు,పిన్ని లక్మయ్య, దేవరాజు,ఈరన్న మొ.. దాదాపు 100 కుటుంబాలు పెద్దఎత్తున టిడిపి లో చేరడం జరిగింది.వీరందరికీ  వీరభద్ర గౌడ్  టిడిపి కండువాలువేసి పార్టీలోకి ఆహ్వానించారు.వీరభద్ర గౌడ్  మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్న అభివృద్ధిని చూసి అలాగే టిడిపి  మ్యానిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలునచ్చి వీరందరూ పార్టీలో చేరడం జరిగింది అని అన్నారు. ముఖ్యంగా ఈకార్యక్రమంలో కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షులు  తిక్కారెడ్డి గారు అలాగే గ్రామ టిడిపి నాయకులు వీరసేన రెడ్డి,దేవిరెడ్డి, వన్నూరప్ప,ఈరన్న,లక్మి రెడ్డి,పక్కిరప్ప,యంకప్ప, G.లక్మయ్య,విరుపాక్షి ఇతర గ్రామ నాయకులు మండలానికి చెందిన ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు.

About Author