దుబాయ్ లో మైక్ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు
1 min readఉపకార సంస్థలో రూ. 51 కోట్ల పెట్టుబడి పూర్తి చేసినట్లు ప్రకటన
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ మైక్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఎల్ఈడీ వీడియో డిస్‌ప్లే రూపకల్పన, అభివృద్ధి మరియు తయారీలో ప్రపంచ నేతృత్వం వహిస్తున్న సంస్థ, దుబాయ్ ఉపకార సంస్థ మిస్సస్ ఎస్ఓఏ ఎలక్ట్రానిక్స్ ట్రేడింగ్ ఎల్ఎల్ సి లో రూ. 51 కోట్ల పెట్టుబడిని పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఈ ఉపకార సంస్థ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ ఉపకరణాల విడిభాగాల వ్యాపారంలో నిమగ్నమై ఉంది. సమీప కాలంలో, ఏసి మరియు నాన్-ఏసి రైల్వే కోచ్‌ల కోసం జిపిఎస్ ఆధారిత పబ్లిక్ అడ్రస్ & ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మరియు ఎల్ఈడీ డెస్టినేషన్ బోర్డ్స్ సామర్థ్య నిర్ధారణకి సంస్థ అనుమతిని పొందింది.అదనంగా, మిక్ డిజిటల్ ఇండియా లిమిటెడ్ పేరుతో పూర్తి యాజమాన్య ఉపకార సంస్థను కూడా సంస్థ ప్రారంభించింది. ఈ సంస్థ వివిధ రకాల స్మార్ట్ మీటర్లు, డిజిటల్ మీటర్లు, రూఫ్ మౌంటెడ్ ఏసి ప్యాకేజీ యూనిట్లు, ఇంటిగ్రేటెడ్ పవర్ సప్లై సిస్టమ్స్, మినీ కంప్యూటర్లు, మైక్రోప్రాసెసర్ ఆధారిత సిస్టమ్స్ మరియు కంప్యూటర్ పరికరాల తయారీలో నిమగ్నమవుతుంది.1988 నుండి ఎల్ఈడీ వీడియో డిస్‌ప్లేలు, హై-ఎండ్ ఎలక్ట్రానిక్ పరికరాలు, టెలికాం సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో ముందంజలో ఉన్న మైక్, ఐఎస్ఓ 9001:2008 మరియు ఐఎస్ఓ 14001:2004 సర్టిఫికేషన్ కలిగిన సంస్థగా ఖ్యాతి పొందింది. హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ సంస్థ భారతదేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో విస్తృతమైన మార్కెటింగ్, అమ్మకాలు, మరియు సేవా మద్దతు కేంద్రాల ద్వారా జాతీయస్థాయిలో ప్రాముఖ్యత కలిగి ఉంది.మైక్ ఎలక్ట్రానిక్స్ టెలికాం, ఎల్ఈడీ డిస్‌ప్లేలు, మరియు ఇతర ప్రోగ్రెసివ్ ఉత్పత్తుల్లో కీలక భూమిక పోషిస్తూ ప్రపంచ విపణిలో విస్తరిస్తోంది.