మంత్రి నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేయాలి
1 min readతెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సంగం రాష్ట్ర కన్వీనర్ ,జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై. నాగేశ్వరరావు యాదవ్
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: కర్నూలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో తెలుగుదేశం పార్టీ మంత్రివర్యులు నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రి చేయాలని తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వై నాగేశ్వరరావు యాదవ్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – కుప్పం నుంచి మొదలుకొని శ్రీకాకుళం వరకు ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకొని ప్రతి ఒక్కరి బాగోవులను ప్రతి ఒక్క జిల్లాలో భారి బహిరంగ సభలను ఏర్పాటు చేసి ప్రజల,జిల్లా,మండల గ్రామాల పురోగతి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులు అరాచకాలను తెలుసుకుంటూ ముందుకు వచ్చి సాగారు. నారా లోకేష్ ముఖ్యమంత్రి ఐతే తప్ప రాష్ట్రం బాగుపడదు. ఈనాడు లేని విధంగా తెలుగుదేశం పార్టీకి కొత్త టెక్నాలజీ తో ప్రతి సామాన్య కార్యకర్తలకు కూడా న్యాయం జరిగే విధంగా సరికొత్త విధానాలను తీసుకొచ్చారు. అదేవిధంగా బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం బీసీలకు ప్రత్యేక ప్యాకేజ్ బీసీలపై ఆయనకున్న ప్రేమ,ఆప్యాయతను తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీలో ప్రతి సామాన్య కార్యకర్తలకు మేమున్నామన్న భరోసాను కల్పించింది నారా లోకేష్ బాబు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గిస్తే కానీ ఇప్పుడు నారా లోకేష్ బాబు 24 శాతం ఉన్న రిజర్వేషన్లను 34 శాతానికి కల్పిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసే వ్యక్తి నారా లోకేష్ బాబు .