PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి టి.జి భరత్ కు శుభాకాంక్షలు

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ను ఆదివారం ప్రముఖులు కలిశారు. సంకల్ బాగ్ లోని మంత్రి నివాసంలో కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ప్రధాన కార్యదర్శి,  జీజీహెచ్​ రిటైర్డు సూపరింటెండెంట్​, సీనియర్​ కార్డియలజిస్ట్​ డా. చంద్రశేఖర్​, సభ్యులు డా. భవాని ప్రసాద్​ మరికొందరు వైద్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ఆంధ్ర ప్రదేశ్​ కు పరిశ్రమలు తీసుకొచ్చి.. అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.  కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ కు ఎంతో సహాయం చేసిన మంత్రి టి.జి. భరత్​ మున్ముందు మరెన్నో పదవులు పొందాలని ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్​, డా. భవాని ప్రసాద్​ అభిలాషించారు.

About Author