మంత్రి టీజీ భరత్ కు శుభాకాంక్షలు
1 min readకర్నూలు, పల్లెవెలుగు:పారిశ్రామిక వృద్దిలో అత్యుత్తమ స్థానాన్ని పొందిన గుజరాత్ రాష్ట్రం తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది పరుస్తామన్న రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య మరియు ఆహార శుద్ది శాఖ మంత్రి టి.జి.భరత్ కు టీడీపీ జిల్లా నాయకుడు నాగరాజు యాదవ్ తో పాటు మరికొందరు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్ లో రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య మరియు ఆహార శుద్ది శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ది పర్చేందుకు పటిష్టమైన ప్రణాళికలతో వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేయాలని విన్నవించినట్లు జిల్లా నాయకుడు నాగరాజు యాదవ్ తెలిపారు. అదేవిధంగా కర్నూలులో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేసి.. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని మంత్రి టీజీ భరత్ ను కోరామని జిల్లా నాయకులు తెలిపారు.