టి-హబ్‌లో ద 8 మాట్రిక్స్ డిజైన్ కాన్‌క్లేవ్ పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : ద 8 మాట్రిక్స్ డిజైన్ కాన్‌క్లేవ్ పోస్టర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. మాదాపూర్‌లోని టి-హబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంతో కాన్‌క్లేవ్ ఏర్పాట్లు ఊపందుకున్నాయి. నవంబర్ 20వ తేదీన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ ప్రాంగణమైన టి-హబ్‌లో జరిగే ఈ కార్యక్రమం.. డిజైన్ పరిశ్రమలోని నాయకులు, ఆవిష్కర్తలకు ఒక ప్రధాన సమ్మేళనం అవుతుంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. “డిజైన్, టెక్నాలజీ రంగంలో సృజనాత్మకతను, సహకార వృద్ధిని ప్రోత్సహించాలన్న తెలంగాణ నిబద్ధతను పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నొక్కి చెప్పింది. సృజనాత్మకత, ఆవిష్కరణలకు కేంద్రంగా హైదరాబాద్ ఖ్యాతిని మరింత బలోపేతం చేయడం, పరిశ్రమల వృద్ధికి కొత్త అవకాశాలను పెంపొందించడం ఈ సదస్సు లక్ష్యం” అని తెలిపారు. ముందుగా శనివారం జరిగిన వర్క్‌షాప్‌లో డిజైన్ విద్యార్థులు, ఇండస్ట్రీ నిపుణులు, మెంటార్లతో సహా 250 మందికి పైగా పాల్గొన్నారు. వర్క్‌షాప్‌లో పలువురి ప్రజంటేషన్లు ఉన్నాయి. దీంతోపాటు నిపుణులతో సంప్రదింపులు కూడా ఉండడం వారికి కలిసొచ్చింది. అసాధారణ ప్రదర్శనలకు గుర్తింపు లభించింది, ఇది సదస్సుకు ఒక స్ఫూర్తి కలిగించింది. ఈ సందర్బంగా ద 8 మాట్రిక్స్ డిజైన్ కాన్‌క్లేవ్ అధికార ప్రతినిధి రాజ్ సావంకర్ మాట్లాడుతూ, “అర్థవంతమైన చర్చలు, సహకారానికి మా ఈ సదస్సు ఒక ఉత్ప్రేరకంగా పనిచేసింది. అనుభవజ్ఞులైన పరిశ్రమ నిపుణుల నేతృత్వంలో ప్యానెల్ చర్చలను నిర్వహిస్తున్నందుకు మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. వారు తమ నైపుణ్యాన్ని అందరికీ అందించారు. వివిధ రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలతో కూడిన ప్రదర్శనలను రూపొందించడానికి, నెట్‌వర్కింగ్ అవకాశాలతో తోటివారితో అనుసంధానం కావడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, భవిష్యత్తు పురోభివృద్ధికి బాటలు వేసే ప్రత్యేక వేదిక ఇది” అన్నారు. ఫ్యాషన్, జ్యువెలరీ, ఇంటీరియర్స్, సస్టెయినబిలిటీ, గేమింగ్, ప్రొడక్ట్ డిజైన్, ఏఆర్/వీఆర్, హెల్త్ కేర్ సహా పలు రంగాలకు చెందిన నిపుణులను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఎవోల్ స్కిల్స్, మార్స్ మీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్న 8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్‌క్లేవ్ సిద్ధమైంది. ఆలోచనాపరులు ఇన్‌సైట్లను పంచుకోవడానికి, ఆవిష్కరణలను ప్రదర్శించడానికి, డిజైన్ రంగం భవిష్యత్తును రూపొందించడంలో సహకరించడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా పనిచేస్తుంది.