ఎడతెరిపిలేని వర్షాలకు మొలకెత్తిన మినుము పంట..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు చేతికొచ్చిన మినుము పంట మొలకలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్క గడిగరేవుల గ్రామంలోనే ఎడతెరిపి లేని అధిక వర్షం పడడంతో కోత దశకు వచ్చిన మినుములు మొలకలు రావడంతో రైతులు చాలా నష్టపోయామని దాదాపు 500 ఎకరాలు గడిగరేవుల గ్రామంలో కోత కోయని మినుముల పంట ఉందని స్థానిక రైతు గోపాలయ్య తెలిపారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు పంట నష్టం పై మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డిని వివరణ కోరగా అధిక వర్షాల వల్ల ఈ సమస్య తలెత్తిందని క్షేత్రస్థాయిలో పర్యటించి పంటం నష్టం అంచనా వేస్తామని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు.