అట్టహాసంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కే.ఈ. శ్యాంబాబు నామినేషన్ దాఖలు
1 min readనామినేషన్ కు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు పసుపుమయమైన పత్తికొండ పట్టణం
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాం కుమార్ బుధవారం అట్టహాసంగా భారీగా పార్టీ శ్రేణుల నడుమ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు పత్తికొండ నియోజకవర్గం లోని అన్ని మండలాల నుండి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. నామినేషన్ కార్యక్రమం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకుల నడుమ ఉత్సాహంతో కోలాహలంగా భారీ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాం కుమార్ మాట్లాడుతూ, జగన్ దుర్మార్గమైన పాలనకు ఓటుతో బుద్ధి చెప్పాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు నామినేషన్ కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డ్ వద్ద ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, తేరు బజార్ మీదుగా గుత్తి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కేఈ కృష్ణమూర్తి కర్నూలు జిల్లా టిడిపి ఎంపీ అభ్యర్థి నాగరాజు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కే సాంబశివరెడ్డి, బత్తిని వెంకటరాముడు, రామానాయుడు, తుగ్గలి నాగేంద్ర, స్థానిక నాయకులు అశోక్ కుమార్, తిరుపాలు, హోసూరు శ్రీనివాసులు, పెద్దహుల్తి తిప్పన, బత్తిని లోక్ నాథ్, బిటి గోవిందు నరసింహులు శ్రీనివాసులు గౌడ్, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి తన నామినేషన్ ఆర్డీవో కార్యాలయంలో దాఖలు చేశారు. అనంతరం టిడిపి,బిజెపి,జనసేన. నాయకులు కార్యకర్తలు ఉద్దేశించి కే ఈ శ్యాంబాబు మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గం.