PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక  రోడ్ షో

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  గోనెగండ్ల మండలం పెద్ద నెలటూరు, చిన్న నెల్లటూరు, గాజులదిన్నె, గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక   రోడ్ షో.07.05.2024 తేదీన గోనెగండ్ల మండలం  పెద్ద నెలటూరు, చిన్న నెలటూరు, గాజులదిన్నె,  గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక   వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల తో కలిసి జన జాతర లా రోడ్ షో నిర్వహించారు. బుట్టా రేణుక  మాట్లాడుతూ బీసీ మహిళ అయిన నాకు మీరు నన్ను ఎమ్మెల్యే గా గెలిపిస్తే మీరందరి సహాయ సహకారాలతో  అభివృద్ధికి కృషి చేస్తానని, రోడ్లు, డ్రైనేజీలు,వాటర్ సమస్యలు జగనన్న దృష్టికి తీసుకెళ్లి శాశ్విత పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.మీ అమూల్యమైన ఓట్లను మంచి చేసే జగనన్నకే  ఓటు వేయాలని, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు, ఎంపీ అభ్యర్థి అయిన బి వై రామయ్యకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి వేయించాలని అభ్యర్థించారు.ఈ ప్రచారంలో గోనెగండ్ల మండలం నాయకులు, సర్పంచులు ,ఎంపిటిసిలు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

About Author