నిరవధికంగా కొనసాగుతున్న ఎమ్మెల్యే చింతమనేని వరద సహాయక చర్యలు
1 min readవరద తీవ్రత నష్టాన్ని, సహాయక చర్యలు, ఎమ్మెల్యేకి వివరించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లాలో రామిలేరు వాగు వరద పోటెత్తడంతో పెదపాడు మండలంలోని అప్పన్నవీడు సహా పలు గ్రామాలు ముంపుకు గురైన నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వీ, ఎస్పీ ప్రతాప్ కిషోర్, జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డిలకు వరద తీవ్రతను, ప్రజలకు కలిగిన నష్టాన్ని, బాధితుల సమస్యలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా వివరించారు. మెరుగైన సత్వర చర్యలు చేపట్టాలని కోరారు.రామిలేరు వాగు వరద పోటెత్తడంతో గత అర్థరాత్రి నుంచి ఇప్పటి వరకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముంపు గ్రామాల్లో అక్కడే ఉండి వరద సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొంటున్నారు.అదే విధంగా పునరావాస కేంద్రాల్లోని ప్రజలను తమ ఇంటి బంధువులు గా భావిస్తామని, ఎలాంటి లోటు లేకుండా చూస్తామని. లోతట్టు ప్రజలు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.