వాల్మీకి మహర్షి దేవాలయం స్టీల్ గ్రిల్కు ఎమ్మెల్యే 50 వేలు విరాళం..!
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: మండలం పరిధిలోని గజ్జెహళ్లి గ్రామంలోని శ్రీ వాల్మీకి మహర్షి దేవాలయానికి స్టీల్ గ్రిల్ కుఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి50000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.అనంతరం గ్రామ పెద్దలు శాలువా, పూలమాలతో ధన్యవాదాలు తెలిపారు. గజ్జహల్లి లోని వాల్మీకి సోదరులందరూ ఎమ్మెల్యే విరుపాక్షి కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హొళగుంద మండల్ కన్వీనర్ షఫీ ఉల్లా బజారి స్తగిరి,శివమూర్తి,ముకయ్య, హెబ్బటం రమేష్, కాలప్ప,శంకరప్ప,తదితరులు పాల్గొన్నారు.