నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: పట్టణంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 19 ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చాంఒక సూపర్ లగ్జరీ బస్సు ఎనిమిది ఎక్స్ప్రెస్ సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ బస్సులు మరియు హెయిర్ బస్సులుగా ఆరు సూపర్ లగ్జరీ బస్సులను మరియు రెండు ఎక్స్ప్రెస్ సర్వీసులను మరియు రెండు పల్లె వెలుగు సర్వీస్ లను మొత్తం 19 బస్సులను ఎమ్మెల్యే బీవీ ఎమ్మిగనూరు డిపోలో ప్రారంభించారు.గత ప్రభుత్వం ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోకు ఒక బస్సు కాదు.. ఒక టైరు కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రయాణికులకు ఇబ్బందికరంగా లేకుండా 6 నెలలలో నాలుగు సార్లు 19 కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చామని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో 2 కొత్త బస్సులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా కూటమి ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. ప్రతి రహదారిలో బస్సులను తిరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ అమర్నాథ్, పాల్గొని ఈసారి ఎమ్మెల్యే వేరే కార్యక్రమంలో బిజీగా ఉన్నందువల్ల ఎక్స్ప్రెస్ సర్వీసును ఆయన డిపోలో నడిపి ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ తో పాటు, సహాయ కార్యదర్శి గంగుండి నాగరాజు పాల్గొని ఎమ్మెల్యే కి పూలదండతో శాలువాతో ఘనంగా సత్కరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.