PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ నేతలపై ఎమ్మెల్యే గిత్త ఫైర్..

1 min read

ప్రభుత్వం పట్టించుకో లేదన్నది అవాస్తవం

మనుషులను చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత మీది కాదా..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ముచ్చుమర్రి చిన్నారి వాసంతి కేసును ప్రభుత్వ పట్టించుకోలేదని వైసీపీ నేతలు మాట్లాడడం సరికాదని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో టిడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నేతలు వాసంతి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేయడం శుభపరిణామం అని కానీ ఈ కేసు ఇంకా కొనసాగుతూ ఉందని ఈ సంఘటనను మానవతా దృక్పథంతో అందరూ ఖండించారని సంఘటన జరిగిన అనంతరం అప్పుడే ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని అన్నారు.కానీ ముఖ్యమంత్రి,హోమంత్రి పట్టించుకోలేదని వైసీపీ నేతలు మాట్లాడడం తగదని రాజకీయ దురుద్దేశంతోనే అవాక్కులు చవాక్కులు మీరు పేల్చుతున్నారు మీ మాటలు దెయ్యాలు వేదాలు అల్లించినట్లు ఉందని అంతే కాకుండా మీ హయాంలో మనుషులను చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత మీది అని వైసీపీ నేతలపై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు.ఈ కేసులో రాజకీయ కోణం అసలే లేదన్నారు.ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు మంచిది కాదని ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.ఈ కార్యక్రమంలో పగిడ్యాల మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి,కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి,క్లస్టర్ ఇన్చార్జి ముర్తుజావలి,ఆర్ట్ శీను,షకీల్ అహ్మద్,వేణుగోపాల్,పట్టణ మహిళా నాయకులు మీనాక్షి పాల్గొన్నారు.

About Author