ముస్లిం మైనార్టీ కాన్ఫరెన్స్ కు ఎమ్మెల్యేకు ఆహ్వానం..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యకు అరుదైన ఆహ్వానం అందింది. రాజ్యాంగాన్ని రక్షించండి మరియు దేశాన్ని రక్షించండి అనే చాలా ముఖ్యమైన అంశం పై కర్నూలు పట్టణంలోని డివిఆర్ హోటల్లో డిసెంబర్ 21న జరిగే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కాన్ఫరెన్స్ సమావేశానికి రావాలని సోమవారం అల్లూరులో ఎమ్మెల్యే జయసూర్యను మైనారిటీ కమిటీ సభ్యులు మరియు నందికొట్కూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ,2 వ వార్డ్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ కలసి ఆహ్వానించారు.ఈ కాన్ఫరెన్స్ సమావేశానికి రాష్ట్ర మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,మేధావులు హాజరవుతున్నారని వారు తెలిపారు.మన దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై తమ అభిప్రాయాలను రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించడం జరుగుతుందని తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ అవగాహనకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి మరియు తదితర వాటి గురించి చర్చించడం జరుగుతుందనివారు అన్నారు.