మంత్రి..కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే జయసూర్య
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య శనివారం మధ్యాహ్నం నంద్యాలలో మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత నందికొట్కూరు నియోజకవర్గంలోని రోడ్లు గురించి మరియు నియోజకవర్గ అభివృద్ధికి నిధుల మంజూరు చేయాలని ఎమ్మెల్యే మంత్రికి విన్నవించారు.కర్నూలు జిల్లాకు నూతన కలెక్టర్ గా వచ్చిన రంజిత్ భాష ఆయన శుక్రవారం కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. శనివారం సాయంత్రం కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో నూతన కలెక్టర్ ను నందికొట్కూరు ఎమ్మెల్యే కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత నాయకులనుందని కలెక్టర్ కు పరిచయం చేయించారు ఎమ్మెల్యే..ఈ కార్యక్రమంలో నాయకులు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రబ్బాని కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్కాతా రమేష్ రెడ్డి ప్రసాద్ రెడ్డి పలుచాని మహేశ్వర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ముర్తుజావలి పాల్గొన్నారు.