PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గోరుకల్లు రిజర్వాయర్ కు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని గోరుకల్లు జలాశయం కు నీటిని విడుదల చేశారు వనకచర్ల నుంచి గోరుకల్లు జలాశయం కు నీరు చేరడంతో జలాశయంలోకి 5000 క్యూసెక్కులు  బైపాస్ కెనాల్ ద్వారా ఎస్ఆర్బిసి కాల్వకు 1000 క్యూసెక్కుల  నీటిని విడుదల చేశారు గోరుకల్లు జలాశయంలోకి నీరు చేరే ఇంట్లో రెగ్యులేటర్ వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి జలాశయంలోకి ఎస్సార్ బీసీ కాల్వకు నీటిని విడుదల చేశారు వచ్చే ఐదేళ్లలో నియోజకవర్గంలో ఉన్న గోరుకల్లు అలగనూరు తదితర రిజర్వాయర్లను పూర్తి చేస్తామన్నారు గత ఐదేళ్ల కాలంలో జలాశయం నిర్మాణం పూర్తిగా నిలిచిపోయిందని దీంతో కట్టతెగి పోవడంతో పాటు కృంగిపోయి సాగునీరు రైతులకు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తిచేసిన పనులను అలాగే వైకాపా ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో కట్ట కృంగిపోయి సాగునీటికీ ప్రశ్నార్థకంగా మారిందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రత్యేక దృష్టి సారించి రిజర్వాయర్ల ద్వారా సాగునీరును అందించాలని అధికారులను ఆదేశించామన్నారు గోరుకల్లు జలాశయ పూర్తికి వంద కోట్లు అవసరమని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని ఈ ఐదేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు  కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ఆర్బిసి అధికారులు పాల్గొన్నారు.

About Author