PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 కేసీ కెనాల్ కు నీటిని విడుదల చేసిన ..ఎమ్మెల్యే 

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువ కావడం అదేవిధంగా పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా విడుదల చేయడంతో వల్లూరు మండలం పెన్నా నది పై నిర్మించిన ఆది నిమ్మాయిపల్లి ఆనకట్ట వద్ద గురువారం ఉదయం కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి చెన్నూరు కేసీ కెనాల్ కాలువకు గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు, ముందుగా కేసీ కెనాల్ డిఇ.బ్రహ్మారెడ్డి. ఏఈ. జమాల్ వల్లి, ఎమ్మెల్యే పి.కృష్ణ చైతన్య రెడ్డి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పూజలు నిర్వహించిన అనంతరం నీటిని విడుదల చేశారు, అలాగే ఎమ్మెల్యే ఆనకట్ట పరిసర ప్రాంతాలను అక్కడ ఉన్న గేట్లను పరిశీలించి కేసీ కెనాల్ అధికారులతో కెనాల్ నీటి విషయంపై మాట్లాడడం జరిగింది, చెన్నూరు మండలంలో కేసీ కెనాల్ కింద రైతులు 8 వేల ఎకరాలు వరి పంట సాగు చేయడం జరుగుతుందన్నారు, అదేవిధంగా కడప మండల పరిధిలో 5000 ఎకరాలు వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు,ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడం శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం పెరిగి డ్యాము ద్వారా నీటిని దిగువకు విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని ఆయన తెలిపారు,కెసికెనాల్ డి ఇ.బ్రహ్మ రెడ్డి మాట్లాడుతూ పెన్నా నది లో7వేలు క్యూసెక్కులు నీటి ప్రభ ఉందని కడప చెన్నూరు కేసీకాలవలకు నీటిని విడుదల చేయడం జరిగిందని తెలిపారు, ఈ కార్యక్రమంలో కేసీ కెనాల్ ఏఈ. జమాలవల్లి, చెన్నూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. కల్లూరు విజయ భాస్కర్ రెడ్డి చెన్నూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పొట్టి పాటీ రానా ప్రతాపరెడ్డి,తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందిరెడ్డి శివారెడ్డి, అటవీ శాఖ మాజీ డైరెెక్టర్ రామన శ్రీలక్ష్మిి, మల్లికార్జున రెడ్డి తెలుగు యువత కార్యనిర్వాహక జిల్లా కార్యదర్శి. ఆవుల పవన్ కుమార్ రెడ్డి, ఆకుల చలపతి, ఆవుల బసిరెడ్డి, మణికంఠ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author