ఎమ్మెల్యే రూ. 10 వేలు ఆర్థిక సహాయం
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: మంత్రాలయం మండలం రచ్చమర్రి మోడల్ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని పార్వతి హాస్టల్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైకాపా యువజన నాయకులు ప్రదీప్ రెడ్డి తక్షణ సహాయం కింద రూ 10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. సోమవారం మోడల్ స్కూల్ హాస్టల్ లో పార్వతి అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి దృష్టికి వెళ్లడంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వైకాపా నాయకులు వై. ప్రదీప్ రెడ్డి ,జి. భీమారెడ్డి హాస్టల్ వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఆత్మహత్య కు గల కారణాలను పూర్తి స్థాయిలో విచారణ జరిపి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ శివనారయణ శర్మను కోరారు. అనంతరం పార్వతి సమీప బంధువులకు తక్షణ సాయం కింద రూ 10 వేల నగదును విద్యార్థిని తండ్రికి అందజేశారు.ధైర్యంగా ఉండాలని ఆత్మహత్య వెనుక ఎంతటి వారు ఉన్న కఠిన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వై. ప్రదీప్ రెడ్డి వివరించారు. హాస్టల్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు,భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి థామస్ వై. ప్రదీప్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.