ఎమ్మెల్యే వాస్తవాలు మాట్లాడాలి…
1 min readరోడ్లకు మరమ్మత్తులు కూడా చేయని వైసిపి రోడ్డు మంజూరు చేసిందనడం హాస్యాస్పదం…
ఆలూరు తెదేపా ఇంచార్జ్ వీరభద్ర గౌడ్
హొన్నూరు క్యాంప్ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన…
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: హొన్నూరు క్యాంప్ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం ఆలూరు తెదేపా ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 70 ఏళ్లుగా ఈ గ్రామానికి రోడ్డు లేక గ్రామస్తులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని,సంక్రాంతి వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి సంక్రాంతికి ఈ రోడ్డును హొన్నూరు క్యాంపు గ్రామస్తులకు బహుమతిగా ఇస్తామని అన్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఈ రోడ్డు గురించి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం లోనే రోడ్డు మంజూరు చేయడం జరిగిందని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్లకు కనీసం గుంతలు కూడా పూడ్చలేదని అన్నారు.హొన్నూరు క్యాంప్ రోడ్డు అక్టోబర్ నెల నాలుగవ తేదీన 70 ఏలుగా ఈ గ్రామానికి రోడ్డు లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద 4 కోట్ల 75 లక్షల నిధులతో మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. వాక్ స్వాతంత్రం ఉందని అవాస్తవాలు మాట్లాడితే ఎలా అని ఎమ్మెల్యే ను ప్రశ్నించారు. ఇదే రోడ్డు కట్లే మాగి క్యాంపుకు 2 కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అన్నారు. అదేవిధంగా మట్టి రోడ్డు కలిగిన ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తామని అన్నారు. త్వరలోనే హోళగుంద – ధనాపురం రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని అన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు, కార్యకర్తలు, బివిజి అభిమానులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.