నిరుద్యోగ యువత కోసం తడికలపూడిలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ బిజీ-బిజీ
1 min readచింతలపూడి నియోజకవర్గంలో నేటితో మూడు మండలాల్లో ఉద్యోగ మేళలు నిర్వహించిన ఎమ్మెల్యే
నిరుద్యోగ యువతను ఆదుకునేలా నాలుగు మండలాలలో ఉద్యోగమేళాలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆఖరి రోజు ఆదివారం లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగ మేళ నిర్వహించమన్నరు.కామవరపు కోట మండలం తడికలపూడిలో నిరుద్యోగ యువతను ఆదుకునేలా నాలుగు మండలాల్లో ఉద్యోగమేళాలు నిర్వహిస్తున్నట్లు సొంగ రోషన్ కుమార్ శనివారం తెలిపారు.తడికలపూడి లోని ఒక ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉద్యోగమేల నిర్వహించారు.స్వయంగా ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో వారికి ఇంటర్వ్యూ తో పాటు మౌలిక పరీక్షలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్, బెంగళూరు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగాలు లభించేలా ఆయనే స్వయంగా నిరుద్యోగుల కోసం హెచ్ఆర్ గా పనిచేస్తున్నారు.తనను నమ్ముకున్న తన నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం ఒక్కరోజు విరామం లేకుండా పార్టీ కార్యక్రమాలతో పాటు నిరుద్యోగ విద్యార్థుల భవిష్యత్తు కోసం కూటమి నాయకులతో కలిసి ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నా మన్నరు. కార్యక్రమంలో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి పాల్గొన్నారు.