PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 ఎమ్మెల్యే టీజీ భరత్​కు శుభాకాంక్షలు

1 min read

రిటైర్డు కార్డియాలజిస్ట్​, ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​

కర్నూలు, పల్లెవెలుగు:సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే టీజీ భరత్​కు కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ నేతృత్వంలో రిటైర్డు కార్డియాలజిస్ట్​, ప్రస్తుత ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ యాదవ్​ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు మెడికల్​ హబ్​గా పేరుగాంచిందని, అభివృద్ధిలో చతికిల పడిన  ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి ఆధునిక పరికరాలు సమకూరేలా చూడాలని కోరారు. అదేవిధంగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూసి.. ప్రజల మన్ననలు చూరగొనాలని సూచించినట్లు డా. చంద్రశేఖర్​ తెలిపారు. అంతేకాక మెడికల్​ కళాశాలలో పీజీ సీట్లు పెంచాలని, ఇందుకు వైద్యరంగంపై ప్రత్యేక దృష్టిసారించాలని  ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీజీ భరత్​కు తెలిపినట్లు రిటైర్డు కార్డియాలజిస్ట్​, ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ వెల్లడించారు. ఎమ్మెల్యే టీజీ భరత్​ను సన్మానించిన వారిలో హార్ట్​ ఫౌండేషన్​ సభ్యులు, సీనియర్​ వైద్యులు డా. భవాని ప్రసాద్​, తదితరులు ఉన్నారు.

About Author