మిడుతూరు సర్పంచ్ ఇంటికి ఎమ్మెల్యే..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రమైన గ్రామ సర్పంచ్ విద్యాపోగుల జయ లక్ష్మమ్మ ఇంటికి మంగళవారం మ 12:30 కు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య వెళ్లారు.ఎమ్మెల్యే తో పాటు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి,వంగాల శివరామిరెడ్డి తదితర టిడిపి నాయకులు సర్పంచ్ ఇంటికి వెళ్లారు.సర్పంచ్ జయలక్ష్మమ్మ మరియు ఆమె భర్త బక్కన్న ఎమ్మెల్యేను రమేష్ రెడ్డిని సురేంద్ర నాథ్ రెడ్డిని శాలువా పూల మాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాత్రికేయులతో మాట్లాడుతూ నేను మిడుతూరులో జరిగిన సమావేశానికి రాగా సర్పంచ్ కుటుంబం మాకు బంధువులు అయినందున వారు నన్ను ఆహ్వానించారు.కాబట్టి నేను వారి ఇంటికి వచ్చానని అంతేకాకుండా గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్ సహకారం అవసరమని గ్రామ అభివృద్దే మా ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు.