డ్యామ్ ని పరిశీలించిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో 19వ గేట్ చైన్ తెగిపోవడం వలన ఆ గేటు నీటి ప్రహవంకి కొట్టుకుపోవడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న మన ఎమ్మెల్యే బూసినె విరుపాక్షి వెంటనే అక్కడికి చేరుకొని డ్యామ్ ని పరిశీలించడం జరిగింది. తర్వాత మన ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ దీనివలన లక్ష క్యూ సెక్కులకు పైగా నీరు వృధాగా పోవడం జరుగుతుందని, మన రాయలసీమ రైతులకు వ్యవసాయానికి కావలసిన నీరు వృధా కావడం వలన తీవ్ర నష్ట వాటిల్లిందని తెలిపారు. అలాగే త్రాగు నీటికి కూడా చాలా ఇబ్బందిగా మారుతుందని తెలిపారు.ప్రభుత్వం వెంటనే హై టెక్నాలజీ నిపుణులు తో మరమ్మతులు చేపట్టాలని కోరారు.ప్రస్తుత ప్రభుత్వం ప్రతి దానికి డబ్బులు లేవు అంటూ సాకులు చెపుతూ వస్తుందని, అదే విధంగానే డ్యామ్ మెయింటనెన్స్ కి సరిపడా డబ్బులు ఇవ్వకపోవడం వలనే ప్రజలకు ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. కావున ఇప్పటికి అయినా చంద్రబాబు మేల్కొని మిగిలిన శ్రీశైలం,నాగార్జున సాగర్ లాంటి డ్యామ్ లకి సరైన మెయింటనెన్స్ చేసి వాటినన్న కాపాడాలని ఎమ్మెల్యే ప్రభుత్వాని హెచ్చరించడం జరిగింది.