సీనియర్ టిడిపి నాయకులు ఉల్తెప్ప ను కలిసిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, చిన్నహుల్తి గ్రామ మాజీ సర్పంచ్ బత్తిని ఉల్తెప్పను స్థానిక ఎమ్మెల్యే శ్యాం కుమార్ కలిసి పరామర్శించారు. గత కొంతకాలంగా టిడిపి సీనియర్ నాయకులు వుళ్తెప్ప అనారోగ్యంతో ఇంటికే పరిమిత మయ్యారు. సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం ఆయన సేవలందించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శ్యాం కుమార్ ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ కు స్వాగతం పలికారు. ఆయనకు పూలమాలతో సత్కరించారు. అన్నివేళలా ఆయనకు పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు రామనాయుడు బత్తిని లోకనాథ్, క్రాంతి రవి కుమార్, మీనాక్షప్ప, ముత్తుకూరు హనుమంతు, రంగయ్య, రామలింగప్ప, మల్లేష్, లింగన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక సీఐ జయన్న పోలీస్ సిబ్బంది ఎమ్మెల్యే వెంట ఉన్నారు.