బండల ఫ్యాక్టరీని ప్రారంభించిన ఎమ్మెల్యే.. మాండ్ర
1 min readపూల వర్షంతో ఘన స్వాగతం పలికిన తాటిపాటి బ్రదర్స్..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో “అయ్యన్న మండల ఫ్యాక్టరీ”ని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రారంభించారు.గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు పట్టణంలోని మిడుతూరు రహదారిలో నయారా పెట్రోల్ బంక్ దగ్గర తాటిపాటి బ్రదర్స్ నూతనంగా నిర్మించిన బండల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఎమ్మెల్యేకు మరియు మాండ్ర శివానందరెడ్డి కి మారుతి నగర్ టిడిపి నాయకులు తాటిపాటి బ్రదర్స్ అయ్యన్న ఏసేపు రమేష్,మాధవరం పరమేష్ మరియు కుటుంబ సభ్యులు పూల బోకెలతో మరియు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు.అంతే కాకుండా భారీ గజమాలతో వారు సన్మానించారు.తర్వాత మండల ఫ్యాక్టరీని ఎమ్మెల్యే జయసూర్య,శివానందరెడ్డి, పట్టణ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ,2 వ వార్డ్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ ఫ్యాక్టరీనీ రిబ్బన్ కట్ చేసి మరియు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.వ్యాపార రంగంలో ముందుకు రాణించాలని దేవుడు మిమ్ములను దీవించాలని మీ కుటుంబం అభివృద్ధి బాటలో నడవాలని వారు ఆకాంక్షించారు.తర్వాత ఏర్పాటు చేసిన నేతలు నాయకులు ప్రజలు విందును స్వీకరించారు.ఈ కార్యక్రమంలో చెరుకుచెర్ల రఘు రామయ్య,టిడిపి నాయకులు పలుచాని మహేశ్వర్ రెడ్డి,భాస్కర్ రెడ్డి, ఎస్ఎండీ జమీల్,లాయర్ జాకీర్,మూర్తు జావలి,గిరీశ్వర్ రెడ్డి,డాక్టర్ వనజ,మీనాక్షి,సౌదీ చాంద్,డాక్టర్ రాజు,కాటేపోగు నాగ సురేష్,రాజన్న,నాగేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.