ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థిని విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే కే.ఈ. శ్యాం కుమార్ శనివారం ప్రారంభించారు. పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత గానో కృషి చేస్తుందని, అందులో భాగంగానే ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ ఈ సందర్భంగా అన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీవో భరత్ నాయక్, పత్తికొండ సి.ఐ. జయన్న ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పదవ తరగతి వరకు చదివి ఇంటర్మీడియట్ చదువు కోసం గ్రామీణ ప్రాంత విద్యార్థులు మండల, నియోజకవర్గ కేంద్రాలలో చదువుల కోసం వచ్చే విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం ఇబ్బందులు పడకుండా జూనియర్ కళాశాలలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఇంటి దగ్గర నుండి ప్లేట్, గ్లాస్ తీసుకురానవసరం లేదని అందుకోసం ఎమ్మెల్యే కె శ్యామ్ కుమార్ గారు 40 వేల రూపాయలతో ప్లేట్లు గ్లాసులు కొనుగోలు చేసేందుకు ప్రిన్సిపాల్ కు నగదును అందజేశారు. 2014-19 మధ్య ఇంటర్ విద్యార్థులకు సైతం అప్పటి టీడీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేసిందనీ, అయితే ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసిందని గుర్తు చేశారు.ఈ విషయంపై 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ యువగళం పాదయాత్రలో అనేక మంది విద్యార్థులు నారా లోకేశ్ వద్ద తమ గోడు.