పది ఫలితాల్లో మోడల్ పాఠశాల రికార్డ్
1 min readమోడల్ కళాశాలలో ఇంటర్ కు అడ్మిషన్లు ప్రారంభం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: సోమవారం మధ్యాహ్నం వెలువడిన పదవ తరగతి ఫలితాలు నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో ఉన్న ఏపీ మోడల్ పాఠశాల విద్యార్థులు రికార్డ్ సృష్టించారు.మండల టాపర్ గా నందికొట్కూరు పట్టణానికి చెందిన పి.శ్రావ్య శ్రీ-591 మార్కులు,రెండవ స్థానంలో మిడుతూరుకు చెందిన డి.సోనీ-582,,మూడవ స్థానంలో బైరాపురం గ్రామానికి చెందిన సి.భరత్-580 మార్కులతో మోడల్ పాఠశాల విద్యార్థులు ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ సలీం భాష తెలిపారు.మండలంలో 433 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 303 మంది విద్యార్థులు 69.98 శాతం ఉత్తీర్ణత సాధించారని ఎంఈఓ రామిరెడ్డి తెలిపారు.గ్రామాల వారీగా ఉత్తీర్ణత సాధించిన వారి సంఖ్య-మిడుతూరు కస్తూర్బా పాఠశాలలో 38 కి 31,జిల్లా పరిషత్ లో 77 గాను 43,తలముడిపిలో 20 కి గాను 9,కడుమూరులో 63 కు గాను 44,చెరుకుచెర్లలో 18 కి గాను 9,చౌటుకూరులో 35కుగాను 25,అలగనూరులో 19 కి 10, కలమందలపాడు 17 కు గాను 12,దేవనూరు 11 కు గాను 8, కడుమూరు ఉర్దూ 8 కి గాను 5,వీపనగండ్ల 17కు గాను 9,చెన్నకేశవ పాఠశాల 17 కు 17 మంది విద్యార్థులు పాస్ అయ్యారని ఎంఈఓ తెలిపారు. మిడుతూరు ఏపీ మోడల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరడానికి అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ సలీం భాష తెలిపారు.పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు కళాశాలలో చేరవచ్చని మీకు సంబంధించిన పత్రాలతో వచ్చి చేరవచ్చని మరిన్ని వివరాలకు ప్రిన్సిపాల్ నెంబర్=9398421521 సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.