PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోడల్ పాఠశాల ఆరవ తరగతి ఫలితాలు విడుదల

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మోడల్ పాఠశాల ఆరవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ సలీం భాష శనివారం తెలిపారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని ఆదర్శ మోడల్ పాఠశాలలో ఆరవ తరగతిలో చేరుటకు ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20వ తేదీన జరిగిన పరీక్షకు 161 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 84 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.ఉత్తీర్ణత కనబరచిన విద్యార్థుల జాబితాను మోడల్ పాఠశాలకు నోటీస్ బోర్డులో అతికించినట్లు విద్యార్థులు పాఠశాల దగ్గరికి వచ్చి మీ పేర్లను చూసుకోవాలని ఇప్పుడు పదవ తరగతి పరీక్షలు మోడల్ పాఠశాలలో జరుగుతున్నందున మధ్యాహ్నం 12 తర్వాత పేర్లను చూసుకోవాలని ఆయన అన్నారు.నోటీస్ బోర్డులో పేర్లు ఉన్న విద్యార్థులు ఈనెల 31వ తేదీ లోపు పాఠశాలలో మీ ధృవ పత్రాలు అందజేయాలని ప్రిన్సిపాల్ తెలియజేశారు.

About Author