PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జీవితాలు నేటి యువతకు ఆదర్శప్రాయం

1 min read

మహాత్మా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమంలో

సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ .

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జీవితాలు నేటి యువతకు ఆదర్శప్రాయమని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న తన క్లినిక్ లో జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలా పుట్టినరోజు మనకు ఎంతో పవిత్రమైన దినమని తెలిపారు. ముఖ్యంగా జాతిపిత మహాత్మా గాంధీ మన దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని ఆయన కొనియాడారు . మహాత్మా గాంధీ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అహింస, సత్యాగ్రహం పేరుతో హింసకు దూరంగా ఒక దేశ ప్రజలను బానిస శృంఖలాల నుంచి విడిపించిన మహానుభావుడని కొనియాడారు. మహాత్మా గాంధీజీ గురించిన అహింసా సిద్ధాంతం ప్రపంచ దేశాలు ఆచరించే స్థాయికి చేరిందని తెలిపారు . ఎందుకు నిదర్శనంగా ప్రపంచంలోనే 180 దేశాల్లో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేశారంటే ఆయన ఎంతటి మహనీయుడో అర్థమవుతుందని వివరించారు .ప్రపంచంలో ఎవరూ చెప్పని విధంగా తన జీవితమే ఒక సందేశం అని చెప్పిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని కొనియాడారు. సత్యాన్ని ఆచరించడం ఎంత కష్టమో సత్య హరిచంద్ర జీవితాన్ని మనం పుస్తకాల్లో చదివామని, కానీ అలాంటి సత్యాన్ని ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. మన దేశంలోని అన్ని మతాలు ,అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు ,అన్ని జాతులు, అన్ని తెగలు మహాత్మా గాంధీని అభిమానిస్తాయని తెలియజేశారు. అలాగే లాల్ బహుదూర్ శాస్త్రి నిబద్ధతకు నిజాయితీకి నిలువుట అందంగా నిలిచారని ఆయన కొనియాడారు. ఆయన దేశ స్వాతంత్ర పోరాటంలో జైలు జీవితాన్ని గడిపారని, కొద్ది కాలం ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించారని వివరించారు. ఇలాంటి మహనీయుల పుట్టినరోజు వేడుకలను తన క్లినిక్ లో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా నేటి యువత వారిని స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన సూచించారు. భారత సంతతి ఉన్న అన్ని దేశాల్లో వీరిద్దరిని ప్రతి ఒక్కరు ఆరాధిస్తారని ఆయన చెప్పారు .ముఖ్యంగా మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షత పై తరదైన శైలిలో ఉద్యమించి అందరికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. అంత గొప్ప పేరు ఉన్నప్పటికీ ఆయన నిడారంబర జీవితం, వస్త్రధారణ అందరికీ ఆదర్శప్రాయం అని చెప్పారు. మహాత్మా గాంధీ మౌనం, సమన్వయం ల గొప్పతనం గురించి చెప్పారని వివరించారు .అన్ని మతాలు, అన్ని జాతులను ,అన్ని ప్రాంతాలను గౌరవించాలన్న మహాత్మా గాంధీ శక్తిని ప్రతి ఒక్కరు పాటించాలని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ సూచించారు.

About Author