ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలంటే ఆధునిక కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి
1 min read– లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని నైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ,ఎస్. వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో సిటీ స్థాయి క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభ కార్యక్రమంలో లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ మంచి పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు పొందాలంటే కంప్యూటర్ నైపుణ్యం తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు .దీనిపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారన్నారు. 14 నుంచి 17 సంవత్సరాల లోపు యువతీ యువకులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పై క్విజ్ పోటీలను పోటీలను నిర్వహించారు .అనంతరం కార్యక్రమంలో విజేతలకు ప్రశంసా పత్రాలు, బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మీ ఎడ్యుకేషన్స్ సొసైటీ అధ్యక్షురాలు లయన్ రాయపాటి నాగలక్ష్మి ,కె.వి.ఆర్ కళాశాల అధ్యాపకులు కే .వెంకట నాగిరెడ్డి, బి .జ్యోతి, శివయ్య, నవీన్, నైస్ స్వచ్ఛంద సేవ సంస్థ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.