PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండలం లో ప్రశాంతంగా ముగిసిన మొహారం వేడుకలు

1 min read

పీర్ల దేవుళ్ళు త్యాగానికి గుర్తుగా మొహారం

ఇస్లాం క్యాలెండర్ నూతన దినోత్సవం మొహారం

పల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండలంలో గ్రామ గ్రామంలో కొలువైన పీర్లదేవుళ్ళు కులమతాలకు అతీతంగా భక్తిశ్రద్ధలతో కొలిచే ఆరాధ్య దేవుళ్ళు బుధ వారం ప్రశాంతంగా వేడుకలు ముగిశాయి. పీర్లదేవుళ్ళు గ్రామ ప్రజలందరు 10 రోజులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ఫతేహాలు, షర్బట్, రోటీ లను నైవేద్యం సమర్పించారు. ముస్లిం లు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకునే పండుగ మొహారం ఒకటి పది రోజులు పాటు జరిపే ఈ పండుగ సందర్భంగా ఇస్లాం కు సంబంధించిన ప్రవచనములు మొహమ్మద్ ప్రవక్త బోధనలు వినిపిస్తాయి మొహారం నెల పదోరోజున పీర్లను ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున హజ్రత్ ఇమాం హుషేన్ ను అసైన్ హుష్హేన్,అక్బర్ అలీ మరియు పీర్ల దేవుళ్ల గుర్తుగ పంజా ( ప్రతిమ) లను ఉరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం తొలి మాసాన్ని మొహారం నెలగా భావిస్తారు. మొహారం పండుగ పదో రోజున ప్రత్యేకత ఉంది 10,11 వ రోజుల్లో ఉపవాస దీక్షలు పాటించడాన్ని ముస్లింలు పవిత్రంగా భావిస్తారు. మొహారం నెలలో ముస్లింలు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించారు. తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన హజ్రత్ ఇమామ్ హుషేన్ కు సంతాపం తెలిపే ఉద్దేశ్యం తో ముస్లింలు పాటిస్తారు.మానవ హక్కులకోసం జరిగిన చరితాత్మక పోరాటం మొహారం ఈ పేరు వినగానే పిర్లు, నిప్పుల గుండాలు గుండెలు బాదుకుంటు మతం చడవటాలు గుర్తుకువస్తాయి. బుధవారం గ్రామ ,మండల ప్రజలు  భక్తిశ్రద్ధలతో   జరుపుకున్నారు. సాయంత్రం  పీర్లదేవుళ్ళు ఊరేగింపుగ వెళ్లారు.ఊరేగింపు లోప్రజాలు నైవేద్యాలు సమర్పించారు.జామియా మస్జీద్ నందు షార్భత్ ఫాతేహ నిర్వహించి షార్భత్ ప్రతి ఒక్కరికి పంచడం జరిగింది.  అనంతరం పీర్ల దేవుళ్ళు భక్తి భావంతో  ప్రత్యేక ఫతేహాలు,ఏటికి తీసుకుని వెళ్లారు. ప్రత్యేక ఫతేహాలు అనంతరం షర్బట్ ,రొట్టెలు పంచి పెట్టారు. ఎస్.ఐ నరేంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  పోలీసులు బారి బంద్బస్తు చేపట్టారు.  భారీగా ముస్లిం సోదరులు, హిందు సోదరులు పాల్గొన్నారు.

About Author