PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలు పర్యవేక్షణ

1 min read

ఆహారం, మంచినీరు, వైద్య సౌకర్యాలు ఏర్పాటు

3517 మంది ప్రజలు వనరావస కేంద్రాల్లో సురక్షితం

జంగారెడ్డిగూడెం ఆర్డీవో కె అద్దయ్య

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : గోదావరి వరద ముంపు వలన వేలేరుపాడు మండలంలోని 36 గ్రామాలు ప్రభావిత గ్రామాలుగా గుర్తించి సహాయక చర్యలు చేపట్టడమైనదని జంగారెడ్డిగూడెం ఆర్డివో కె. అద్దయ్య తెలిపారు. కోయిదా, కటుకూరు, నార్లవరం, రుద్రంకోట, తాట్కూరుగొమ్ము, రేపాకగొమ్ము పంచాయితీల్లోని వరద ప్రభావిత కుటుంబాల కొరకు 4 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.  ప్రస్తుతం శివకాశీపురం నందుగల పునరావాస కేంద్రానికి రేపాకగొమ్ము నుంచి 393 కుటుంబాలను, వేలేరుపాడు గ్రామం నుండి 15 కుటుంబాలను, నెమలిపేట ఆర్ అండ్ ఆర్ కాలనీలోని పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందన్నారు.  ప్రస్తుతం 15 వరద ప్రభావిత గ్రామాలకు కూరగాయలు, పాలు, కొవ్వొత్తులు, వాటర్ ప్యాకెట్లు, మస్కిటోకాయిల్స్, బిస్కట్లు, 800 టార్పాలిన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.  ముందస్తుగా అవసరంమేరకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచామన్నారు.  మండలంలో ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్ డిఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ కు, ఫైర్ డిపార్ట్ మెంట్ వారి బృందాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.  విద్యుత్ సమస్య లేకుండా 12 జనరేటర్లను అందుబాటులో ఉంచామన్నారు. పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షించి మూడవ ప్రమాద హెచ్చరికకు అనుగుణంగా కూడా సహాయ చర్యలు మరింత వేగవంతం చేసేందుకు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 18 బోట్లు సిద్ధం చేశామన్నారు. అదే విధంగా పెద్దవాగు ప్రాజెక్టు నుండి వరద నీరు ఆకస్మత్తుగా ముంచెత్తడం వలన మండలంలోని మేడేపల్లి, రామవరం, తాట్కూరుగొమ్ము, రేపాకగొమ్ము, పంచాయితీల్లోని 12 గ్రామాలు ప్రభావితం అయిన సందర్బంలో ఆయా ముంపు ప్రభావిత గ్రామాలకు చెందిన 968 కుటుంబాలకు చెందిన 3517 మంది ప్రజలకు పునరావాస కేంద్రాల్లో సురక్షితంగా ఉంచడం జరిగిందన్నారు.  వారికి అవసరమైన భోజనం, మంచినీరు, చంటిపిల్లలకు పాలు, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.  ప్రభావిత కుటుంబాలకు 117 టార్పాలిన్లు కూడా పంపిణీ చేశామన్నారు.

About Author