ఏలూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో దోమల నివారణ కార్యక్రమం
1 min readఆగస్టు ఒకటి నుండి 31 వరకు డయేరియా క్యాంపెయిన్ ప్రోగ్రాం
హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాలతి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆగస్టు 1 జూలై 2024, నుండి 31, ఆగస్టు, 2024 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రోగ్రాం లో భాగంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి) వారి ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు రాకుండా మలేరియా విభాగం వారితో 20వ డివిజన్ లోని నరసింహారావు పేట పేట , గ్రాండ్ ఆర్య రోడ్డు, రైల్వే ట్రాక్ రోడ్, డాక్టర్ జగన్మోహన్రావు వీధి, తదితర ప్రాంతాల్లో దోమల లార్వా నిర్మూనలకు స్ప్రేయింగ్, మురుగు కాలువ కల్వర్టు కింద ఫాగింగ్, ఖాళీ స్థలలోఉన్న నిలవనీటిలో ఆయిల్ బాల్స్ వేయడం, ఫాగింగ్ డైలీ షెడ్యూల్ ప్రకారం 02-08-24 రాత్రి పలు డివిజన్లో ఫాగింగ్ పెట్టడం జరిగిందని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డా:మాలతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో నాయకులు యంవివిఎస్ నాగేశ్వరరావు, మలేరియా ఇన్స్పెక్టర్ దత్తి వేణుగోపాల్ స్వామి , మలేరియా సూపర్వైజర్ డి. దుర్గారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ బి. ఏడుకొండలు మరియు , ఆరోగ్య కార్య దర్శి, ఆశా కార్యకర్తలు మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.