ఏలూరు నగరపాలక సంస్థ దోమల నివారణ కార్యక్రమం
1 min read30వ డివిజన్ లో స్ప్రేయింగ్, ఫాగింగ్, ఆయిల్ బాల్స్ తో దోమల నివారణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆగస్టు1 జూలై 31, వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రోగ్రాం లో భాగంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి) వారి ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు రాకుండా మలేరియా విభాగం వారితో 30వ డివిజన్ లోని మంచినీళ్లు తోట, ఏటిగట్టు, మోతే వారి తోట, తదితర ప్రాంతాల్లో దోమల లార్వా నిర్మూనలకు స్ప్రేయింగ్, మురుగు కాలువ కల్వర్టు కింద ఫాగింగ్, ఖాళీ స్థలలోఉన్న నిలవనీటిలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగిందని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డా:మాలతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పలు పారిశుద్ధ్య కార్మికుల మస్తర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ చేశారు. పలు డివిజన్లో తిరిగి పారిశుద్ధ్య పనులను, డ్రైనేజీ వ్యవస్థను పర్వేక్షించి సిబ్బందికి తగు సూచనలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పప్పు ఉమామహేశ్వరరావు ,మలేరియా ఇన్స్పెక్టర్ దత్తి వేణుగోపాల్ స్వామి , శానిటరి ఇన్స్పెక్టర్ కె స్టీఫెన్ రాజు మరియు , ఆరోగ్య కార్య దర్శి, ఆశా కార్యకర్తలు మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.