తల్లి పాలు..బిడ్డకు శ్రేష్ఠం..
1 min readపుట్టిన బిడ్డకు వెంటనే తల్లి పాలివ్వాలి
- తల్లి పోషక ఆహారం తీసుకోవాలి
- ఇన్ ఫెర్టిలిటి స్పెషలిస్ట్ డా.ఆర్. శ్రావ్య రాజశేఖర్ , సి.ఎన్.ఆర్. హాస్పిటల్
కర్నూలు, పల్లెవెలుగు: బిడ్డ పుట్టిన మూడు గంటలకే తల్లి పాలు ఇవ్వడం వల్ల…బిడ్డ ఆరోగ్యం శ్రేయస్కరంగా ఉంటుందన్నారు సి.ఎన్.ఆర్. హాస్పిటల్ ఇన్ ఫెర్టిలిటి స్పెషలిస్ట్ డా.ఆర్. శ్రావ్య రాజశేఖర్. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం ఆమె తల్లి పాల ప్రాముఖ్యత గురించి వివరించారు. తల్లిపాలు శిశువు యొక్క మొదటి టీకా. తల్లిపాలు శిశువు ఎదుగుదలకి అవసరమైన పౌష్టికాహారం సమపాళ్ళలో అందిస్తుంది. ఇది వైరస్‌లు మరియు బ్యాక్టీరియా నుండి శిశువులను రక్షించేందుకు సహాయపడే యాంటీబాడీలు కలిగి ఉంటుంది. చెవి ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, మరియు విరేచనాలు వంటి అనారోగ్యాలు తగ్గిస్తాయి. శిశువు యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా అభివృద్ధి చెందుతున్న ప్రాథమిక నెలలలో ఈ సహజ రక్షణ చాలా ముఖ్యం.
దీర్ఘకాలిక వ్యాధులకు చెక్…:
తల్లిపాలతో పోషణ పొందిన పిల్లలలో భవిష్యత్తులో మాంద్యంలో, షుగర్ వ్యాధి, మరియు క్యాన్సర్లు వంటి దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవు. రొమ్ము పాలతో తల్లి మరియు శిశువు మధ్య ఒక ప్రత్యేక భావోద్వేగ సంబంధాన్ని పెంచుతుంది. ఇది భద్రత మరియు భావోద్వేగ అనుభూతిని పెంపొందిస్తుంది. పిల్లల మానసిక అభివృద్ధికి ముఖ్యము మరియు దీర్ఘకాలంలో సానుకూల ప్రభావాలను కలిగి ఉంటుంది.
తల్లులకూ…మేలు…:
తల్లులకు రొమ్ము పాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రసవం తరువాత తల్లి గర్భాశయాన్ని మామూలు పరిమాణానికి తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాక రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గడంలో మరియు రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
పోషకాహారం..అవసరం…:
పుట్టినప్పటి నుంచి బిడ్డకు ఆరు నెలల వరకు తల్లి పాలు ఇవ్వడం మంచిది. రెండు గంటలకోసారి పిల్లలకు తల్లిపాలివ్వాలి. దీని వల్ల శిశువుకు సరైన పౌష్టిక ఆహారం అందజేస్తుంది. తల్లి కూడా పోషక ఆహారం తీసుకోవాలి. ఐరన్ టాబ్లెట్లు రెండు నెలల వరకు వాడితే తల్లి ఆరోగ్యంగా ఉంటుంది. బిడ్డ ఏడ్చిన వెంటనే… ఆకలితో ఏడ్చారని అనుకోవడం పొరపాటు. బిడ్డ కదలికలను, పరిస్థితులను బట్టి వైద్యం అవసరమైతే.. వెంటనే దగ్గరలోని వైద్య నిపుణులను సంప్రదిస్తే మంచిది. తల్లి పాలతో అటు బిడ్డకు…ఇటు తల్లికి ఇద్దరికీ మేలు జరుగుతుందని స్పష్టం చేసిన సి.ఎన్.ఆర్. హాస్పిటల్ ఇన్ ఫెర్టిలిటి స్పెషలిస్ట్ డా.ఆర్. శ్రావ్య రాజశేఖర్.. తల్లిపాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.