మోటార్ సైకిల్ … 18 లీటర్ల నాటు సారా స్వాదీనం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, కర్నూలు వారి ఆదేశముల మేరకు కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది కొల్లంపల్లి తాండ వద్ద ధాడులు జరుపగా కొల్లంపల్లి తాండ నందు మూడవత్ పార్వతి బాయి అనే ఆడ వ్యక్తి మరియు ఆమె భర్త సుగాలీ కుమార్ నాయక్ (పారిపోయాడు) దగ్గర ఒక మోటార్ సైకిల్ మరియు 18 లీటర్స్ నాటు సారాయి స్వాదీనము చేసుకొని, సదరు ఆడ వ్యక్తి ని అదుపులోకి తీసుకొని కేసును నమోదు చేసి రిమండ్కు పంపినట్టు మరియు పారిపోయిన మగ వ్యక్తి ని త్వరలో అరెస్ట్ చేస్తాము అని కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కే.చంద్రహాస్ తెలిపారు. ఈ దాడులలో కర్నూల్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కే.చంద్రహాస్, ఎస్ఐ కె.నవీన్ బాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు అని తెలిపినారు.