PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోటర్ సైకిల్ల దొంగ అరెస్టు  ..మరొకరు పరారి                    

1 min read

ఐదు బైకులు, ఒక ఆటో స్వాదీనం

రివార్డులు అందుకున్న హెడ్ కానిస్టేబుల్ రాఘవేంద్ర, కానిస్టేబుల్ దశరథ్ రాముడు.     

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : ఐదు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో చోరీ చేసిన కేసులో మంత్రాలయం పోలీసులు దొంగను పట్టుకున్నారు. వాహనాలను స్వాదీనం చేసుకొని దొంగను రిమాండ్ కు తరలించారు. బుధవారం స్థానిక పోలీసు స్టేషన్ లో ఎమ్మిగనూరు డివిజన్ ఇన్చార్జి డీఎస్పీ శ్రీనివాసాచారి విలేకరుల సమావేశంలో  చోరీ కేసు వివరాలను వెల్లడించి దొంగ, వాహనాలు మీడియ ముందు ఉంచారు.  సి బెలగల్ మండలం పొలకల్లు గ్రామానికీ చెందిన ఉప్పర వీరేష్, మరొకరు దేవనకొండ మండలం తెర్నేకల్లు గ్రామానికీ చెందిన రాజు. వీరిద్దరూ కలసి మంత్రాలయం, ఏమ్మిగనూరు పట్టణం, కోసిగి, కర్నూలు టౌన్, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో ని రోడ్డుపై ఆపి ఉన్న ఐదు (యుర్నికార్న్, ఎఫ్ జేడ్, హీరో హోండా, ప్లాటినం, హోండా సైన్) మోటర్ సైకిల్ లను, మరొకటి అప్పీ ఆటోను చోరీ చేశారు. వాటి విలువ సుమారు రూ. 3.60 లక్షలు ఉన్నాయి. వాటిని కేసు తదుపరి నిమిత్తం స్వాదీనం చేసుకున్నారు. వీరి కర్ణాటక రాష్ట్రం లో విక్రయించి ఆ డబ్బు తో జల్సాలు చేస్తున్నారు. వాహనాలను తమ దగ్గర ఉన్న కట్టర్ల సాయం తో లాక్ వైర్లను కట్టచేసి స్టార్టు చేసి తీసుకెళ్తారు. వాటిని ఒక చోట పెట్టి కర్ణాటకలో గుర్తు తెలియని వెక్తులకు అమ్మేస్తారా. సమాచారం మేరకు మంత్రాలయం సీఐ రామంజులు, ఎస్ ఐ పరమేష్ నాయక్ ల ఆధ్వర్యంలో లో హెడ్ కానిస్టేబుల్ రాఘవేంద్ర, కానిస్టేబుల్ దశరథ్ రాముడు దర్యాప్తు చేశారు. అందులోని పొలకల్ కి చెందిన వీరెష్ దొరికాడు. మరొకరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి దొంగను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ రాఘవేంద్ర, కానిస్టేబుల్ దశరథ్ రాముడు లను అభినందించి నగదు రివార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, కోదండ రామిరెడ్డి, కానిస్టేబుల్ లు గోవిందరాజులు, రాఘవేంద్ర, జమీర్ పాల్గోన్నారు.

About Author