PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్నా క్యాంటీన్ సందర్శించి… అల్పాహారం స్వీకరించిన ఎంపీ..ఎమ్మెల్యే

1 min read

రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం…త్వరలో జంగారెడ్డిగూడెంలో ప్రారంభిస్తాం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు ఆర్ ఆర్ పేటలోని అన్నా క్యాంటీన్ ను ఈరోజు ఉదయం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్యతో కలసి సందర్శించి, అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాంటీన్ లో ఆహార పదార్థాలు రుచికరంగా ఉన్నాయన్నారు. ఏలూరులో 4, నూజివీడులో 1 అన్న కాంటీన్లను ప్రారంభించారని, త్వరలో జంగారెడ్డిగూడెంలో కూడా ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించారని, మరో 103 వచ్చే నెలాఖరు నాటికి ప్రారంభిస్తామన్నారు. అందుకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం 236 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 5 రూపాయలకే అందిస్తున్నామన్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు ఉపయేగపడతాయన్నారు.

పేదలు, రైతుల సంక్షేమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ పేదలకు పట్టడన్నం పెట్టడానికే అన్నా క్యాంటీన్లు పెట్టామన్నారు. జనసేన ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు రూ: 50 వేలు, దాకారపు రాజేశ్వరరావు రూ : 50 వేలు అన్నా క్యాంటీన్లకు విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎం ఆర్ డి బలరామ్ ఎస్ ఎమ్ ఆర్ పెదబాబు, దాసరి ఆంజనేయులు, చోడే వెంకటరత్నం, ఆర్నేపల్లి తిరుపతి, మాగంటి హేమసుందర్, పిలారిశెట్టి సురేష్, మాగంటి ప్రభాకర్  అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author